* ఉడుతా భక్తి !
* ఏ ఎండకు ఆ గొడుగు !
* చంద్రునికో నూలు పోగు !
* కలిమి లేములు కావడి కుండలు !
* అండ ఉంటే కొండలు దాటవచ్చు !
* గోరంతలు కొండంతలు చేయడం !
* చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు !
* అగ్నికి వాయువు తోడైనట్లు !
* గుడ్డికన్న మెల్ల మేలు !
* విత్తు మంచిదైతే, మొక్క మంచిదవుతుంది !
* అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు !
* ముంజేతి కంకణానికి అద్దమేల?!
* అర్థ బలం కంటే అంగబలం ఎక్కువ!
* తీగ లాగితే, డొంకంతా కదిలినట్లు !
* ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం!