* అందని పండ్లకు అర్రులు చాచినట్లు!
* అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు!
* అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం!
* ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు!
* ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట!
* ఆకారపుష్టి నైవేద్యనష్టి!
* ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు!
* ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు!
* ఇంటికన్నా గుడి పదిలం!
* ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత!
* ఇంట్లో పిల్లి వీధిలో పులి!
* ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య!
* ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు!
* ఈగ వ్రణం కోరు – నక్క పీనుగ కోరు!
* ఈగను కప్ప మ్రింగితే – కప్పను పాము మ్రింగుతుంది!