సర్పానికి నోటితో ఆక్సిజన్

Telugu Lo Computer
0


పామును చూస్తేనే భయపడతాము. అలాంటిది ఒడిశా మల్కన్​గిరి జిల్లాలోని నువాగూడ షాహీలో  ఓ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్న నాగుపాము (కోబ్రా)కు నోటితో ఆక్సిజన్​ అందించి రక్షించాడు. తన ఇంటిలో పామును చూసిన యజమాని స‌హాయం కోసం స్నేక్​ హెల్ప్​లైన్ ను సంప్ర‌దించాడు. అక్కడికి చేరుకున్న హెల్ప్​లైన్ సిబ్బంది ఆ పాము ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ట్లు గుర్తించారు. పాక‌లేని స్థితిలో సొమ్మసిల్లిపోయి ఉన్న కోబ్రాకు స్నేహాశీష్​ అనే హెల్ప్​లైన్ సభ్యుడు  చిన్న పైపు సాయంతో నోటితో గాలి ఊదాడు. దీంతో కాసేప‌టికి ఆ పాములో చ‌ల‌నం క‌నిపించింది. దీనిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో  పెట్టారు. ఈ విజువ‌ల్స్ వైరల్​గా మారాయి. సకాలంలో స్పందించి పాము ప్రాణాలు రక్షించిన స్నేహాశీష్​పై ప్రశంసలు కురుస్తున్నారు 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)