భయమేలా?

Telugu Lo Computer
0

 


కరోనా వైరస్ మానవ..పశు వైరస్ల mating వల్ల పుట్టింది.దానికి

90 spikes ఉంటాయి..వాటిసాయంతో అవి మానవ కణంలో

ప్రవేశించి మన జీవ వస్తువును  వాడుకొని వాటి xerox copies 

తయారుచేసుకుంటాయి.ఆ పని ప్రతి వైరస్ చేస్తుంది.వైరస్ సహజ 

ధర్మం మ్యుటేషన్.అంటే తనలోపలి జీవ వస్తువుని మారుస్తుంది. 

తద్వారా కొత్తకొత్త బాధలు పెడుతుంది..


ఈ బాధలన్నింటికీ కారణం మనమే!!వైరస్ కాదు..వైరస్

నిన్న ఉంది ఇవాళ ఉంది రేపు ఉంటుంది.మనం ఎప్పుడూ

వైరస్ తో.. హానికర బాక్టీరియా తో యుద్దమ్ చేస్తూనే ఉంటాం!

ఆ చైతన్యం భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టే

మనం యుగాలుగా బ్రతికి ఉన్నాం! ఆ దివ్య చైతన్యం పేరు

వ్యాధి నిరోధక శక్తి నీకు తెలియకుండా ఎన్నో దైవం

నీలో చేస్తుంటాడు.మనకి తెలిసి గుండె కొట్టుకోవడం!

ఊపిరి తిత్తులు ఆటోమాటిక్ గా గాలి పీల్చుకోవడం ఇలా

మనకి తెలియనివి చాలా లోపల జరుగుతుంటాయి.

నీ మెదడులో జ్ఞాపకాలు ఎలా నిక్షిప్తం అవుతాయి నీకు తెలియదు.

స్త్రీ గర్భంలో వీర్యకణం అండం చేసే విన్యాసాలు మనకి

తెలియదు.నిద్రలో ఎలా బ్రతికివుంటామో మనకి తెలియదు.

అది చేసే శక్తిని దైవ చైతన్యం అంటాము.. దైవమ్ ప్రతి జీవికి

including వైరస్ కి కూడా ఈ శక్తి ని ఇచ్చాడు..వీటి మధ్య జరిగే పోరే

జగన్నాటకం!!


ఈ శక్తిని  ఆ వైరస్ శక్తికి దీటుగా పొందటమే  మనం చేయాల్సింది!

మన ప్రాచీనులకు ఈ జ్ఞానం తెలుసు! వారు ఆచరించి బహుకాలం

బ్రతికారు. ఇప్పటికీ సంప్రదాయంగా బ్రతికే వారు శతాయుస్సు

తో జీవిస్తున్నారు..


అంత దివ్య శక్తి ని భగవంతుడు ఇస్తే మనం దాన్ని పాడుపనులతో

పోగొట్టుకుంటున్నాం.శరీరాన్ని రోగాల పాలు చేస్తున్నాం.త్రాగుడు

ధూమపానం అతి సంభోగం అతి తిండి కృత్రిమ తిండ్లు..కల్తీ వస్తువు

లతో మన చైతన్యం ఖర్చయిపోతున్నది.నాలుగు అడుగులు

వేయలేకపోతున్నాం!అన్నీ సౌకర్యపు సాధనాలయ్యాయి..

ఆ దివ్య శక్తి రోగనిరోధక శక్తి ని కోల్పోయి ఇవాళ కరోన

లాటి అల్ప జీవి లోపలికి రాగానే బెంబేలు ఎత్తిపోతున్నాం!

భయపడిపోతున్నాం..భయమే అన్ని అనర్ధాలకు మూలం!


భయం ఎందుకు వస్తుంది? కారణం అతి ప్రచారం! కరోన వచ్చి

జలుబు జ్వరం దగ్గు లాటి లక్షణాలతో బాధపెట్టేది నిజమే!

ప్రతి జబ్బుకి లక్షణాలుంటాయిగా! దీనికి ఉన్నాయి!

కానీ కరోన అంటే భయం వచ్చేస్తుంది..అసలు లెక్కలు ఏంటి

అని ఆలోచించే టైం తీసుకోమ్! మన ఊరి జనాభా ఎంత?

ఎంత మందికి వచ్చింది? ఎందరు పోయారు? పోవటం విచారకరమే!

కానీ పోయినవారి శాతం ఎంత? అదే లెక్క దేశం ప్రపంచం విషయంలో

వేయండి! చాలా తక్కువ మరణాలు అని తెలుస్తుంది జనాభాతో

పోలిస్తే! భయం ఎందుకు? జరిగిన ప్రతిదీ మనకి ఆపాదించుకోరాదు!

సృష్టిలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమే!ప్రపంచంలో 15 కోట్ల మందికి కరోన

వస్తే చనిపోయింది కేవలం 31 లక్షలు!అంటే నూటికి ఇద్దరు మాత్రమే!

ఇక భారత్ లో కోటి 66 వేల మందికి కరోన వస్తే చనిపోయింది

ఒక లక్ష 90 వేల మంది.అంటే  నూటికి ఒక్కరు మాత్రమే!

మీ ఊర్లో వంద కేసులున్నాయా? ఉంటే గింటే ఓ పాతిక యాభయి

ఉంటాయి! చావు అనే మాట బాధాకరమే అయినా అది మనకి

రాదు అనే ధైర్యం ఉండాలి! ఆ ఒకరిద్దరిలో మనం వుండము అని

అనుకోవాలి!పాజిటివ్ గా ఆలోచించడం ధైర్యం జాగ్రత్త ముఖ్యం!!


మనం ప్రతిదీ వ్యక్తిపరంగా చూస్తాం!మీడియా అదే ప్రచారం చేసి మనల్ని

భయపెడుతోంది! శవాల గుట్టలు అనీ ..ఆస్పత్రుల లో అదీలేదు ఇదిలేదని!

హైదరాబాద్ అంత సిటీ లో ఒక హత్యో..మానభంగమో జరుగుతుంది!

మన మనసు ఎమ్ చెబుతుంది? మన ఊరిలోనే హత్యలు

జరిగిపోతాయి కాలం చెడిపోయింది అనుకుంటాం! మన ఊరి

ఆడపిల్లలు ఇక బ్రతకలేరు అనుకుంటాం! జరగటం విచారకరమే 

కానీ మనమంతా అతిగా భయపడటం వల్ల ఈ గొడవ!

ఈ భయమే మీడియాకి కావాలి టీఆర్పీ రేట్ పెరగాలంటే!

ఈ బలహీనత నే కరోన విషయంలోనూ మీడియా వాడుకొంటుంది.

అల్లకల్లోలంఅయిన భ్రమని కలిగించి భయపెడుతోంది. అదేమంటే ప్రజలకి

జాగ్రత్తలు చెప్పాలి కదా అనే చోట దాక్కుంటుంది.ఆలోచించండి!


కనుక కరోన వస్తే భయం వదలి వేయండి!! కేవలం నేను

పైన చెప్పిన విధంగా తిని తిరిగి వళ్ళు  పాడు చేసుకొని

ఉన్న దివ్య చైతన్యాన్ని ఆ దిక్కుమాలిన రోగాలకు ఖర్చు

చేసేసుకుంటూ ఉన్నవాళ్లే భయపడాలి!జాగ్రత్త తప్పక 

తీసుకోవాలి వాళ్ళు మాత్రం!!


మీరనవచ్చు రోగాలు లేనిదేవరికండీ ఈ రోజుల్లో అని! నిజమే

కల్తీ ఆహారం కావొచ్చు..జీవన ప్రమాణాలు సరిగా లేక కావొచ్చు

రోగాలు వస్తున్నాయి! కాబట్టి దీనికి చిట్కా..ఆ దివ్య చైతన్యాన్ని

మరింత పెంచుకోవటం!


ఎలా? క్లారియన్ ఫోటోగ్రఫీలో దివ్య చైతన్యాన్ని ఫోటో

తీయగలిగారు శాస్త్రజ్ఞులు.అది ఎక్కువ గా ధ్యానం చేసేవారిలో

ఉంటుంది.సంప్రదాయబద్ధంగా బ్రతికే వారిలో ఉంటుంది.

దయ..నిజాయితీ..విశ్వాసం..దైవభక్తి ..పరోపకారం

లైన్ లో బ్రతికేవారిలో ఉంటుంది..కుట్ర కుతంత్రాలు

ద్వేషం కోపం అసూయ వుండేవారిలో తక్కువ ఉంటుంది.

కనుక దాన్ని ధ్యానం యోగాసనాలు దైవ భక్తి ద్వారా ఆ చైతన్యాన్ని 

పొందవచ్చు!


ఇంకొక మార్గం..మన ప్రాచీనులు చెప్పినవన్నీ విసర్జించామ్!

అవుపేడ అంటే అసహ్యం..పసుపు అంటే చాదస్తం..ఆగర

బత్తి వెలిగిస్తే ఊపిరాడదు..సద్ధి కూడు ఉల్లిపాయ మోటు!

అల్లం వెగటు..పచకర్పూరం వాడనే వాడం! నిమ్మకాయ

వాడేవారు ఎందరు? ఒక రహస్యం గుర్తు పెట్టుకోండి!

మన శరీరాన్నిఆ మన తిండి మాత్రమే కాపాడటం లేదు!

మన శరీరంలో మన కణాలకన్న మన మీద పడి

బ్రతికే సూక్ష్మ క్రిములు ఎక్కువ.వీటిని ప్రో బయోటిక్స్ అంటారు. 

మన కణాలు 100 అయితేఆ క్రిములు 300 వుంటాయి! మన చుట్టాలకన్న 

అన్నదమ్ములకన్న ఇవే మనలని కాపాడుతున్నాయి! ఇవే మనకి రోగాలమీద

పోరాడే శక్తికి తోడ్పడు తున్నాయి.మన దేశం గొప్పదనం

మన పుల్ల మజ్జిగలో ఉంది..ఈ పుల్ల మజ్జిగ లో ప్రో బయోటిక్స్ 

బాగా ఉంటాయి..ఇంకె దేశంలోనూ ఈ పుల్ల మజ్జిగ లేదు.వారికి

గంటలో పెరుగు తయారయి కడుపులోకి వెళ్లిపోవాలి!

కానీ మనం ఈ రాత్రి తోడేసి 10 గంటలు అలాగే ఉంచుతాం!

పెరుగు పులుస్తుంది.దాన్ని మజ్జిగ చేస్తాం! అదే మన అమృతం!

జరిగింది అమృత మధనం అనుకోవాలి!12 గంటలపాటు

పులిసిన మజ్జిగే మనలని రక్షిస్తుంది..ఈ ప్రోబయోటిక్స్

లేకుంటే మనం ఎప్పుడో హాంఫట్ అయిపోయేవాళ్ళం!

కాబట్టి మన ప్రాచీన ఆహార అలవాట్లు బయటికి తీయండి!

సంప్రదాయాలు పాటించండి!ఏ  పురాణంలో నన్నా  మన వాళ్ళు

షేక్ హాండ్ ఇవ్వటం చదివారా? అది మహా ప్రమాదకరం!

పూర్వులకు తెలుసుకాబట్టే నమస్కారం చేయండి రా బాబూ 

అన్నారు! ఇతరులు ఎవరు మాట్లాడినా కాస్త దూరంగా ఉండేవారు.


గుర్తుపెట్టుకోండి..వ్యాక్సిన్ మంచిదే!! దాన్ని *ఏ *అనుకుంటే మన body

* ఏ *వైరస్ నినెదుర్కొంటానికి మాత్రమే ఆంటీ బాడీస్ తయారు

చేస్తుంది. ఏ *వైరస్ *బీ లాగా మేకప్పేసుకొని మారువేషంలో వస్తే మళ్ళీ

 ఆ వ్యాక్సిన్ పనిచేయదు.

ఎన్ని వ్యాక్సిన్ లు వేసుకోవాలి? ఒక్కో వేవ్ కి ఒకోటా? దానికి అంతెక్కడ?

కానీ మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకుంటే అన్ని రకాల

mutation వైరస్ లను అది ఎదిరిస్తుంది. ఎందుకంటే

అది దైవ శక్తి! వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే చెడు అలవాట్లు

మానాలి!!.మంచి పోషకాహారం తినాలి! ముఖ్యంగా ప్రో బయటిక్స్

ఇచ్చే మజ్జిగ లాటివి తీసుకోవాలి!


వైరస్ కి మందు లేదు!!అవి భూలోక జీవులు కాదు ఎలియన్స్!

అవి జీవులు కాదు.!నిర్జీవులు కాదు.కొంత చైతన్యం వుంటుంది.

అంతే!వాటికి తిండి కూడా అక్కరలేదు.తమలాంటి జీవులను

పెంచుకోవాలి!అదే  టార్గెట్! ఆ ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు

దగ్గు జలుబు జ్వరం లాటివి కలగ చేస్తాయి!


సో.. కరోన వస్తే  భయపడక జలుబు మందులు.. జ్వరం మందు

దగ్గుమందు..ఎలర్జీ మందు..సి విటమిన్(నిమ్మరసం)

డీ విటమిన్(రెండుగంటలు ఎండలో నిలిచి వుండండి)

మంచి బలమైన ఆహారం తీసుకోండి! మీకెమి కాదు!

భయమే వద్దు!!ఒక వారంలోనే తేరుకుంటారు!!


చెడుఅలవాట్లతోనో..ఖర్మ ప్రారబ్దం వల్ల వచ్చిన వంశ

పారపంపర్య వ్యాధులు వచ్చిన వారు కాస్త అలెర్ట్ గా

వుండండి! మామూలు వాళ్ళకన్నా కాస్త ఎక్కువ కీడు

వీళ్లకి వైరస్ చేయవచ్చు! ఊపిరి తిత్తులను పాడు చేయటాన

హడావిడి చేయవచ్చు! వారు మాత్రం వైద్యుని సలహా

ప్రకారం నడుచుకోవాలి!


అన్నీ జలుబులు జ్వరాలు కరోనాయే కాదు!కేవలం

వాసన రుచి పోతేనే కరోన వచ్చినట్లు!! అప్పుడు మందులు

వాడండి! మన సీఎం చెప్పింది వేదవాక్కు! కరోన

కొన్ని ఏళ్ళు మనతోనే ఉంటుంది.మందులు వేసుకుంటూ

ఉండటమే!రోగనిరోధకశక్తి పెంచుకోవటమే చికిత్స!!


వైరస్ పాజిటివ్ వచ్చినా భయపడక్కరలేదు! ఎందుకంటే

వైరస్ లేని చోటులేదు..అది సర్వ వ్యాపి..మనం వేసుకొనే మాస్కులు 

కొద్దిపాటిరక్షణనే ఇస్తాయి! చౌకబారు మాస్కులు బాక్టరీయానే లోపలకి

పంపుతాయి.. దానికన్నా 100 రేట్లు చిన్నదయిన వైరస్ మాస్కులోకి

వెళ్లదా? కానీ రక్షణకు మాత్రం పెట్టుకోండి! కారణం మీలో

వైరస్ బయటికి వెళ్లి మరికొందరికి అంటించకుండా వుంటారు!

Post a Comment

0Comments

Post a Comment (0)