ఆకర్షణీయమైన రూపంలో సెల్‌ఫోన్స్‌ను విడుదల చేయటంలో నోకియాకు మరో కంపెనీ సాటి రాదని ఈ మోడల్‌ను చూడగానే ఇట్టే అర్థమౌతుంది. 7500 ప్రిసమ్ పేరుతో విడుదల చేసే ఈ మోడల్‌ను చూడగానే ఎవరికి కొనాలని అనిపించదు మరి! క్యాండీ బార్ ఆకారంలో విడుదల చేసిన ఈ సెల్‌ఫోన్ రూపమే కాదు, ఫీచర్స్ సైతం ఎంతో ముచ్చట గొలుపుతున్నాయి. ఇది కేవలం రెండు అంగుళాల వెడల్పుతో, 16వేల రంగుల స్క్రీన్ కల్గిఉంది. దీనిలో అంతర్గతంగా 30ఎమ్‌బి మెమరీ కార్డు పొందుపరచబడి ఉంది. అంతేగాక ఎక్స్టర్నల్ మెమరీని సైతం పొడిగించుకోవటానికి అనువుగా మెమరీ స్లాట్ కూడా ఇచ్చారు. అన్ని రకాలైన వైర్లెస్ ఫీచర్లు సైతం ఇచ్చారు. ఎమ్‌పి3, ఎఫ్ఎమ్ రేడియో వంటి సదుపాయాలతో పాటు, మల్టీమీడియా సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. త్వరలో దీని ధర ప్రకటించనున్నట్లు నోకియా తెలుపుతోంది.
Post a Comment
0Comments
3/related/default