కేంద్రం గ్యాస్ ధరను తగ్గించడంపై దీదీ విసుర్లు !

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి 'ఇండియా' రెండు సమావేశాలు జరిగాయని, అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ ధరలు తగ్గించాయని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మమతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "గత రెండు నెలల్లో ఇప్పటివరకు, 'భారత్' కూటమి రెండు సమావేశాలు మాత్రమే జరిగాయి, ఈ రోజు మనం ఎల్‌పిజి గ్యాస్ ధరను రూ. 200 తగ్గించడం చూస్తున్నాము. ' ఇది #భారతదేశం యొక్క శక్తి! అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.



Post a Comment

0Comments

Post a Comment (0)