సహజమైన గాలి మేలు!

Telugu Lo Computer
0

 


కొరొనా కాలంలో , అనేక మంది డాక్టర్స్....జబ్బుని రాకుండా ఆపే గొప్ప ఉపకరణంగా పేరుగాంచిన పిపిఈ(PPE) కిట్స్, ఎన్95 మాస్కులూ వాడుతూ కూడా కోవిడ్ జబ్బుకి గురికావడం వింటున్నదే....అలాగే , విమానాలు, రైలులో ఎసి ప్రయాణాలలో కూడా ఎక్కువ మంది ఈ జబ్బు బారిన పడటం మనందరకూ ఎరుకే. ఏసీ ఫంక్షన్ హాల్స్ లో విలాసవంతం గా జరిగిన పెళ్లి, పుట్టినరోజు వేడుకలతో కూడా కోరోన పేషంట్స్ తయారు కావడం తెలిసిందే... మాస్క్, భౌతిక దూరం వున్నప్పటికీ... ఎయిర్ కండిషన్ సిస్టం లో... గాలి ఒకే చోట తక్కువ ప్రాంతంలో తిరగడం దీనికి ఏకైక కారణం అనేది సాధారణ జ్ఞానమే ...

నేటిరోజున ....సాధారణంగా హాస్పిటల్స్ లో కన్సల్టేషన్ చాంబర్ నుండి, వార్డ్, ఐసియు... ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయితే మొత్తం ప్రాంగణమంతా ఎయిర్ కండిషన్‌డ్.... నిజానికి సాంక్రమిక వ్యాధులు... మూసి వున్న, కొద్దిప్రాంతంలొనే గాలి తిరిగే సందర్భాలలో ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి...
హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ (HAI)(నొసొకొమియల్ ఇన్ఫెక్షన్స్) ... అంటే, హాస్పిటల్ లో పేషంట్ కి సోకిన కొత్త జబ్బుల గురించిన అధ్యయనం లో... అమెరికా లో హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన వారిలో 5 శాతం మంది నొసొకొమియల్ ఇన్ఫెక్షన్స్ కి గురి అవుతున్నారు అని తేలింది ... దీనికి ప్రధానమైన కారణం గాలి ధారాళంగా తిరిగే అవకాశ్వం పోగొట్టే ఎయిర్ కండిషనింగ్...క్లోజ్డ్ వాతావరణంలో కోవిడ్ తో సహా, అన్ని అంటువ్యాధులూ ఎక్కువగా వ్యాపిస్తాయి.... నిజానికి అమెరికాలో 2013 లో 75 వేలమంది రోగులు ఈరకమైన హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ (HAI)మూలంగా చనిపోయారు.... ఇది ఆ ఏడాది అమెరికాలో ఎయిడ్స్ జబ్బుతో చనిపోయిన వారి సంఖ్య కన్నా ఎక్కువ.... భారత దేశంలో హాస్పిటల్స్ లో ఏటా దాదాపు 20 లక్షల మరణాలు ఈ రకంగా జరగొచ్చు అని అంచనా.... అయితే, సాంక్రమిక జబ్బులు తక్కువగా వుండే అమెరికా దేశంతో... సింహభాగం ఇన్ఫెక్షస్ జబ్బులే వుండే భారత దేశాన్ని పోల్చలేము... ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండాలి... ఇంత ముఖ్యమైన, చావు బతుకులను తేల్చే అంశం మీద పెద్దగా ఫోకస్ లేదు. అంటే, మన భారతదేశం వంటి వర్థమాన దేశం లో కూడా... ఎయిర్ కండిషనింగ్ లేకుంటే... అదో కొరతగా చూస్తున్నాము... సుఖభోగాలకు ఎంతగా అలవాటు పడ్డామో కదా...
అసలు, సాంక్రమిక వ్యాధులు ఎక్కువగా వుండే పేద, వర్థమాన దేశాల్లో... కనీసం హాస్పిటల్స్ వరకూ, అధమం ఇన్ఫెక్షన్స్ వున్న పేషంట్ వార్డ్స్ వరకూ అయినా ఏసీ వుండకూడదు... జబ్బు ను కలగచెయ్యడానికి కొంత మోతాదు లో సూక్ష్మజీవి వ్యక్తి లో చేరాలి...కోరోనా జబ్బు వ్యాపించకుండా ఇతరుల నుండి మీటర్ పైగా ఎడం పాటించాలి అంటే... గాలిలో ఆ వైరస్ పలచబడుతుంది అని... ఇది గాలి క్లోజ్డ్ వాతావరణం లో కాక, బయట మాత్రమే సాధ్యం. ఎంత గొప్ప ఏసీ గది అయినా, 3 ACH అనగా గంటకు మూడు సార్లు ఎయిర్ చేంజ్ అయినప్పటికీ... సూక్ష్మ జీవులు జబ్బుని కలిగించే సాంద్రతలోనే వుంటాయి....
అయితే, ప్రజల్లో వినిమయ లాలస (కన్స్యూమరిజం) ప్రబలి, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ (మార్కెట్ ఎకానమీ) జనజీవితాలను శాసిస్తున్న ఆధునిక యుగంలో... ఏసీ లను లేకుండా చెయ్యడం అసాధ్యం... అలా చెయ్యగలిగితే, అది సహజావరణ సఖ్యం గా.. భూతాపం పెరగకుండా నిలువరిస్తుంది.... ఈ భూమి మరింత నివాసయోగ్యంగా మారుతుంది... జనం గుమిగూడే పబ్లిక్ ప్రాంతాలలో... థియేటర్స్, మాల్స్, హాస్పిటల్స్, ఆఫీస్, బస్, ట్రైన్ వంటివి వీలైనంత వరకూ క్లోజ్డ్ కాకుండా ఉండటం మంచిది.... ఏసీ భోగాలు ఇంటి వరకూచాలు.... -డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ

Post a Comment

0Comments

Post a Comment (0)