తరుణ్ ఎలాంటి అమ్మాయిని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు : రోజారమణి

Telugu Lo Computer
0


హీరో తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమా జీవితం సాఫీగా సాగితే ఇప్పటికీ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతుండేవాడు. కానీ ఆయన జీవితంలో జరిగిన అనుకొని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ నడిచాయి. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు. సినిమాల సంగతి పక్కన పెడితే ఈయనకు ముగ్గురు భార్యలు అని గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై అప్పట్లో ఎవరు స్పందించలేదు. దాంతో చాలా మంది అది నిజమని నమ్మేసారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తరుణ్ తల్లి నటి రోజారమణి ఈ విషయం పై స్పందించి.. ఆ ముగ్గురు భార్యల వెనుక ఉన్న అసలు రహస్యం బయట పెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కొడుకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లి జరిగింది. మేము చెయ్యలేదు అతను చేసిన సినిమాల్లోకి హీరోయిన్లతో పెళ్లిళ్లు చేశారు. తరుణ్ తో పెళ్లి చేసిన చాలా మంది హీరోయిన్లు ఏంటి ఆంటీ ఇలా చేశారు అని ఫోన్ చేసి అడిగేవారని చెప్పింది. ఇక తరుణ్ కి క్లోజ్ ఫ్రెండ్స్ త్రిష, ప్రియమణి, శ్రీయ వంటి వాళ్ళు అయితే ఆ ఫొటోస్ చూసి నాకు ఫోన్ చేసి తెగ ఆటపట్టిస్తుండేవారు. కానీ తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తను ఎలాంటి అమ్మాయిని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. అందుకు సంబందించిన వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది..

Post a Comment

0Comments

Post a Comment (0)