హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత !

Telugu Lo Computer
0


రోహిత్ వేముల ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్దులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా శుక్రవారం యూనివర్శిటీ వద్ద వారు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే అప్రత్తమై.. యూనివర్శిటీ వద్దకు చేరుకున్నారు. అలాగే అదనపు బలగాలను సైతం అక్కడ మోహరించారు.హెచ్‌సీయూ మాజీ వీసీ పి.అప్పారావు పిటిషన్‌పై హైకోర్టు విచారణను ముగించింది. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ హెచ్‌సీయూ మాజీ వీసీ అప్పారావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రోహిత్ వేముల ఆత్మహత్యతో నాటి వీసీ అప్పారావుకు సంబంధం లేదని గచ్చిబౌలి పోలీసులు స్పష్టం చేశారు.అలాగే రోహిత్‌ ఆత్మహత్యతో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, రాంచందర్‌రావు, స్మృతి ఇరానీకి సైతం సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే కులానికి సంబంధించిన సర్టిఫికెట్‌ విషయంలోనే రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసుల తుది నివేదిక ఆధారంగా తెలంగాణ హైకోర్టు వేముల ఆత్మహత్య కేసు విచారణను ముగించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)