విమానం గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్‌ కవర్‌ !

Telugu Lo Computer
0


మెరికాలోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-800 విమానం ఆదివారం ఉదయం డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాస్టన్‌కు బయల్దేరింది. అయితే, డెన్వర్‌లో టేకాఫ్‌ అయిన పదినిమిషాలకే విమానం ఇంజిన్‌ కవర్‌  ఒక్కసారిగా ఊడిపోయింది. కొంత భాగం రెక్కలను కూడా ఢీకొంది. ఇది గమనించిన పైలట్ విమానాన్ని వెంటనే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఆ సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం ఇంజిన్‌ కవర్‌ ఊడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఘటనపై విమానయాన సంస్థ స్పందించింది. విమానం సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దిగినట్లు తెలిపింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది. మరోవైపు ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ దర్యాప్తునకు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)