సాంకేతిక తప్పిదంతో వేరే జంటకు విడాకులు ?

Telugu Lo Computer
0


యూకేకి చెందిన విలియమ్స్‌ అనే మహిళకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. గతేడాది నుంచి దంపతులు విడివిడిగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వార్దాగ్స్‌ అనే ఓ ప్రముఖ సంస్థను సదరు మహిళ ఆశ్రయించారు. దంపతుల మధ్య ఆర్థిక అంశాలు సంప్రదింపుల దశలో ఉండగానే.. మరో క్లయింట్‌ తుది విడాకుల కోసం రూపొందించిన పత్రాల్లో పొరబాటున విలియమ్స్‌ దంపతుల పేరును చేర్చారు. ఈ పత్రాలను అలాగే కోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేవలం 21 నిమిషాల వ్యవధిలోనే ఆ పత్రాల్లో ఉన్న జంటకు విడాకులు మంజూరుచేసింది. ఈ తప్పిదాన్ని కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ గుర్తించింది. తాము అందజేసిన పత్రాల్లో పొరపాటు జరిగిందని, వీటిని రద్దు చేయాలని కోరుతూ విలియమ్స్‌ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. కానీ, వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. వార్దాగ్స్‌ వ్యవస్థాపకులు అయేషా వర్దాగ్ స్పందిస్తూ..''ఇది తప్పుడు నిర్ణయం. కొందరు చేసిన తప్పిదాల ఆధారంగా విడాకులు ఇవ్వకూడదు. విడాకులు కోరుకునే వ్యక్తులు ఉద్దేశం కచ్చితంగా ఉండాలి. ఇది న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని బలపరుస్తుంది. సాంకేతిక తప్పు జరిగిందని గుర్తించి, దాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి'' అని వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)