హార్ట్ ఎటాక్ - లక్షణాలు !

Telugu Lo Computer
0


హార్ట్ ఎటాక్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా విన్పిస్తున్న మాట. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో చాలా సంకేతాలు కన్పిస్తాయి. ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధికం గుండెపోటు కారణం. చాలామంది గుండెపోటును ఆకస్మాత్తుగా సంభవించేదిగా భావిస్తారు కానీ ఇది వాస్తవం కాదు. గుండెపోటు అనేది దీర్ఘమైన ప్రక్రియ. శరీరంలో చాలా లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా మనం ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ సకాలంలో ఈ లక్షణాలను గుర్తించగలిగితే ప్రాణాంతక గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. ముఖ్యంగా శరీరం ఎగువభాగంలో వచ్చే నొప్పి కీలకమైంది. హార్ట్ ఎటాక్ లక్షణాల్లో ప్రధానమైంది వీపు నొప్పి. దీర్ఘకాలంగా వీపు నొప్పి వస్తుండవచ్చు. చాలామంది కూర్చునే పోశ్చర్ లేదా పడుకునే పోశ్చర్ కారణంగా వస్తుందనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది గుండె పోటుకు సంకేతం కావచ్చు. హార్ట్ ఎటాక్ లక్షణాల్లో అతి సాధారణమైంది ఛాతీ నొప్పి. గుండె నొప్పి వచ్చేటప్పుడే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా ఛాతీ నొప్పి వస్తుంటుంది. అంటే గుండె వ్యాధి సమస్య లేనప్పుడు కూడా ఎసిడిటీ, క్రాంప్స్ కారణంగా ఛాతీ నొప్పి రావచ్చు. అలాగని నిర్లక్ష్యం మంచిది కాదు. గుండె నొప్పి వచ్చే ముందు జబ్బల్లో తీవ్రమైన భరించలేని నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుుడు తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. శరీరం ఎగువ భాగంలో కన్పించే వివిధ రకాల నొప్పుల్లో ముఖ్యమైంది భుజాల నొప్పి. భుజాల్లో అకారణంగా నొప్పి వస్తుంటే మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. ఇది కచ్చితంగా గుండెపోటుకు సంకేతం కావచ్చు. మెడ నొప్పి అనేది హార్ట్ ఎటాక్ ప్రారంభ లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. మీక్కూడా అకారణంగా మెడ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)