నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక !

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ పార్టీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత చిలుముల మదన్ రెడ్డి ఆ పార్టీని వీడారు. సోమవారం అనుచరలతో కలిసి మదన్ రెడ్డి గాంధీభవన్ కు చేరుకున్నారు. గాంధీభవన్ వెలుపల నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి కండువ కప్పి మదన్ రెడ్డిని, ఎలక్షన్ రెడ్డి లను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఈ ఎంపీ ఎన్నికల వేళ మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పర్యాయాలు నర్సాపూర్ శాసనసభ్యులుగా ఎన్నికైన మదన్ రెడ్డికి మెదక్ జిల్లాలో పట్టున్న లీడర్గా పేరుంది. ఈ పార్లమెంటు ఎన్నికలవేళ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీ ఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలాఉండగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తరఫున నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి దాదాపు 2వేల మంది నాయకులు,కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)