చిరంజీవి అజాత శత్రువు. - ఆయన జోలికొస్తే సహించేది లేదు !

Telugu Lo Computer
0

 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కులాల వారీగా ప్రజలను విడగొట్టే కొద్దీ తాను ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్‌ ప్రసంగించారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. సింహం సింగిల్‌గా వస్తుందంటున్నారు.. వైకాపా సింహం కాదు గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్‌ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని మండిపడ్డారు. ''గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా.. నిలబడ్డానంటే మీ అభిమానమే కారణం. దశాబ్దంపాటు ఒడిదొడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగింది. జగన్‌లా నాపై 32 కేసులు లేవు.. రాష్ట్రాభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిశాయి. వలసలు, పస్తులు లేని రాష్ట్ర నిర్మాణమే ఎన్డీయే కూటమి లక్ష్యం. ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే మేం నిలబడ్డాం. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకి నీరు. అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. చేతివృత్తులు, కుల వృత్తులను రక్షిస్తాం. తక్కువ వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడుస్తాయి. వైకాపా పాలనలో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించారు. వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోమని గతంలో చెప్పారు. ఓట్లు అడిగే హక్కు లేదని వైకాపా నేతలకు చెప్పండి. ఆక్వా పరిశ్రమను జగన్‌ సమూలంగా ముంచేశారు.. లాభసాటిగా సాగేలా చూస్తాం. మత్స్యకారులకు ఉపాధి, ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తాం. వారి భవిష్యత్తుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటా'' అని పవన్‌ భరోసా ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)