బెంగుళూరులో నీటి ఎద్దడితో ఖాళీ అవుతున్న వైట్ ఫీల్డ్ ?

Telugu Lo Computer
0


బెంగుళూరులో  అద్దెలు ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతం అయిన వైట్ ఫీల్డ్ లో ఇప్పుడు జనాలు నీళ్లతో యుద్దం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి హైరేంజ్ అపార్టుమెంట్స్ కొని నీళ్ల కోసం రోడ్డెక్కే పరిస్తితి ఏర్పడిందని వాపోతున్నారు. గత మూడు నెలలుగా బెంగుళూరులో నీటి కష్టాలతో ఐటీ కారిడార్ వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఒక్కో కుటుంబం కేవలం నీళ్ల కోసమే ఆరు వేల నుంచి పది వేల వరకు ఖర్చుచేస్తుందట!. అపార్ట్‌మెంట్ వాసులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తుండటంతో ఒక్కొక్క ఫ్యామిలీ అదనంగా ఆరువేలకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో ఫ్యామిలీ మెయింటెనెన్స్ పెరిగిపోవడంతో చాలా మంది అద్దెకు ఉన్న వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారట. రెండు నెలల వ్యవధిలోనే బెంగుళూరు సిటీ వైట్ ఫీల్డ్ లో ఇళ్లు ఖాళీ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో అద్దెలు భారీగా తగ్గిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఏరియాలో 15 నుంచి 20 శాతం వరకు అద్దెలు తగ్గించారట . బెంగుళూరులో నీటి ఎద్దడి లేని సమయంలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దె రూ.27 వేల నుంచి రూ.35 వేల రూపాయల వరకు ఉండేది. కానీ ఇప్పుడు రూ.20 వేలకే అద్దెకు ఇస్తామని యజమానులు చెబుతున్నారట. 20 వేల రెంట్.. ఆరు వేలు నీటి ఖర్చు అవుతుంది. అయినా కూడా అద్దె కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు ఇంటి యజమానులు. ఈ ఏరియాల్లో ఖాళీ చేసి చాలా మంది జనాలు బెంగుళూరు సిటీ శివార్లకు వెళ్లిపోతున్నారట. ఒకప్పుడు వైట్ ఫీల్డ్ లో ఇల్లు అంటే హాట్ కేక్ లా ఉండేవి.. పోటీపడి మరీ అద్దెకు తీసుకునేవారట. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారైనట్లు స్థానికులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)