మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది !

Telugu Lo Computer
0


ర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కుమారస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి అంటే నాకు గౌరవం ఉన్నా ఆయన నా వ్యక్తిగత విషయంలో పదే పదే నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. తాను బండలు పగలగొట్టానని, విషం పెట్టానని, ఆడపిల్లల చేతుల్లోంచి భూములు లాక్కున్నానని ఆరోపణలు చేశారని డీకే శివకుమార్ అన్నారు. నేను బండరాళ్లను పగలగొట్టానని, నేను చట్టబద్ధంగా నా పొలంలో బండరాయిని పగలగొట్టానని, ఎవరి భూమిలో నేను రాళ్లు పగలగొట్టలేదని (క్వారీలు) డీకే శివకుమార్ అన్నారు. పెద్దల పట్ల గౌరవం ఉంటే వారిని గౌరవించాలని డీకే శివకుమార్ అన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఎన్నికల తర్వాత కుమారస్వామి జేడీఎస్ పార్టీ ఎక్కడికి చేరుకుంటుందో వేచి చూడాలని డీకే శివకుమార్ ఎద్దేవ చేశారు. ఒక్కలిగ కులం కోసం ఆయన్ను గౌరవించాను, తన గురించి ఏం మాట్లాడినా సహించానని, ఆయన సవాల్‌ని స్వీకరిస్తున్నానని, లోక్ సభ ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అని డీకే శివకుమార్ అన్నారు. ఎన్‌ఓసీలు ఇవ్వాలంటూ అపార్ట్‌మెంట్ వాసులను బెదిరిస్తున్నారన్న మాజీ సీఎం కుమారస్వామి మీ మీద ఆరోపణ చేశారు కాదా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరులో నీటి ఎద్దడి సమయంలోనూ బెంగళూరు ప్రజలందరికీ తాగునీరు సరఫరా చేస్తున్నాం. కుమారస్వామి తన మాటలను దాచిపెట్టి ప్రజల దృష్టి మరల్చేందుకే తన మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డీసీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. బీజేపీ నేతలు మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. తమ మీద ఇలా మాట్లాడమని మాజీ సీఎం కుమారస్వామికి ఎవరు చెప్పారు? నేను ఆ విషయాన్ని వదిలేస్తాను. కానీ ఆయన స్త్రీలను అవమానించడం సరికాదని, ఆ మాటలను ఆయన మనసులో నుండి తొలగించలేమని డీకే శివకుమార్ అన్నారు. ఇది బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజక వర్గం ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళల అందరి సమస్య అని, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ సీఎం కుమారస్వామిపై డీకే శివకుమార్ విరుచుకుపడ్డారు. మాజీ సీఎం కుమారస్వామి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని, కనీసం మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, ఆర్ అశోక్ ఎందుకు మాట్లాడటం లేదు? అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)