మత్స్యకారుడి వలకు చిక్కిన గోల్డ్ ఫిష్ !

Telugu Lo Computer
0


మిళనాడు లోని తంజావూరు, అదిరంపట్టినం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రవి ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. వల వేసి బయటకు లాగిన తర్వాత అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ వలలో గోల్డ్ ఫిష్ (కచిడి చేప) చిక్కింది. అది కూడా 25 కేజీల బురువుంది. ఇంకేముంది తన పంట పండిదని ఆనందపడ్డాడు. ‘ప్రోటోనిబియా డయాకాంతస్’ అనేది ఈ చేప శాస్త్రీయ నామం. బ్లాక్‌స్పాటెడ్ క్రోకర్ అని కూడా పిలుస్తారు. కచిడి చేపను వేలం వేసేందుకు రవి మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఇది చాలా అరుదైన చేప అవ్వడంతో, కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఎగబడ్డారు. రూ.1000తో ప్రారంభమైన చేప వేలం ఎట్టకేలకు రూ.1,87,770కి వద్ద ముగిసింది. ఈ చేప సాధారణంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రా తీర ప్రాంతాలలో కనిపిస్తుంది. తమిళనాడు తీరంలో ఈ చేపలు చాలా అరుదుగా కనిపిస్తాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ చేప గాల్ బ్లాడర్‌ని శస్త్రచికిత్స దారాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. సింగపూర్‌లో, ఖరీదైన వైన్లను శుభ్రం చేయడంలో ఈ చేప రెక్కలను వాడతారట. దాని మాంసాన్ని సౌందర్య సాధనాల తయారీకి ఉపయోగిస్తారు. మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)