శని, ఆదివారాల్లో విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు !

Telugu Lo Computer
0


వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం - బెంగళూరు నగరాల మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 30 వరకు శని, ఆదివారాల్లో మాత్రమే ఈ రైళ్ల సర్వీసులు అందించనున్నాయి. విశాఖపట్నం - బెంగళూరు (08549) రైలు శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. అలాగే, బెంగళూరు -విశాఖ (08550) రైలు బెంగళూరులో ఆదివారం ఉదయం 8.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, కృష్ణరాజపురం స్టేషన్ల మీదుగా సర్వీసులందించే ఈ ప్రత్యేక రైళ్లలో సెకెండ్ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)