అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్య నగర్ గా మార్చిన మహారాష్ట్ర ?

Telugu Lo Computer
0


హ్మద్ నగర్ జిల్లా పేరును అహల్య నగర్ గా మార్చాలని మహారాష్ట్ర కేబినెట్  నిర్ణయించింది. అహ్మద్ నగర్ నగరాన్ని పుణ్య శ్లోక్ అహల్యాదేవి నగర్గా మార్చడానికి కేబినెట్ ఆమోదం లభించింది. మహారాష్ట్రలోని 'అహ్మద్‌నగర్' 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ పేరు మీదుగా 'అహల్యానగర్'గా మార్చనున్నారు. నగరం పేరు మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నగరానికి పేరు మార్చాలనే ప్రభుత్వ ప్రతిపాదనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గతేడాది మేలో తొలిసారిగా ప్రకటించారు. 15వ శతాబ్దంలో నిజాంషాహీ రాజవంశం, అహ్మద్‌నగర్ పట్టణాన్ని స్థాపించిన అహ్మద్ నిజాంషా నుండి అహ్మద్‌నగర్ నగరం పేరు వచ్చింది.అహ్మద్ నగర్ పేరు మారిపోతోంది! 2023 మేలో అహ్మద్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఏక్ నాథ్ షిండే అహ్మద్ నగర్ పేరును అహల్య నగర్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అహ్మద్ నగర్ జిల్లాలోని చొండి గ్రామంలో జన్మించిన మరాఠా సామ్రాజ్య రాణి అహల్యా బాయి హోల్కర్ గౌరవార్థం ఆమె పేరుతో అహల్యానగర్ గా మారుస్తున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు. 18వ శతాబ్ధపు రాణి 298వ జయంతి సంరద్భంగా షిండే ఈ ప్రకటన చేశారు. 2022లో, ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు.. శంభాజీ నగర్, ధరాశివ్‌లుగా మార్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)