యుద్ధ ట్యాంకు నడిపిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ !

Telugu Lo Computer
0


త్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎప్పటికప్పుడు సైనిక సన్నద్ధతను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆయన సొంతంగా ఓ యుద్ధ ట్యాంకును నడిపినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. వాటికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. సైనికుల్లో స్ఫూర్తి నింపేందుకు స్వయంగా కిమ్‌  రంగంలోకి దిగినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. ఇటీవల అభివృద్ధి చేసిన 'ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ట్యాంకుల' పనితీరును సైనికులతో ఆయన పర్యవేక్షించినట్లు తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. వీటిని ఉత్తర కొరియా తమపై ఆక్రమణకు సన్నాహకంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిస్పందనగా ట్యాంకులతో తమ పాటవాన్ని ప్రదర్శిస్తోంది. భారీ యుద్ధ ట్యాంకులతో చేసిన విన్యాసాల్లో ఉత్తర కొరియా సైన్యం అత్యంత కఠిన పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. డమ్మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు చెప్పింది. 2022 ఆరంభం నుంచి ఈ దేశం నిరంతరం క్షిపణులు, అత్యాధునిక తుపాకులు సహా వివిధ రకాల ఆయుధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోన్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)