రష్యా అధ్యక్షుడిగా తిరిగి వ్లాదిమిర్‌ పుతిన్ ?

Telugu Lo Computer
0


ష్యాలో విడతలవారీగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుతిన్‌ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ ఇటీవల జైలులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇతర ప్రత్యర్థులు సైతం ప్రవాసంలోనో, జైళ్లలోనో ఉన్నారు. రంగంలో మిగిలిన ముగ్గురు అభ్యర్థులు మిత్రపక్షాలకు చెందిన నామమాత్ర ప్రత్యర్థులే. ఈ నేపథ్యంలో 71 ఏళ్ల పుతిన్‌ రష్యా అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్ర, శనివారాల్లో పోలింగ్‌ సజావుగానే సాగినా కొన్ని ప్రాంతాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. నావల్నీ మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రాల్లో నిరసన తెలిపారు. అయితే.. ఎన్నికలను అడ్డుకోవాలని చూసేవారికి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కొందరు శాసనకర్తలు ప్రతిపాదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)