జనరల్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ఇక చిల్లర కష్టాలకు చెక్‌ !

Telugu Lo Computer
0


రైల్వే స్టేషన్లలో జనరల్‌ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు దక్షిణ మధ్య రైల్వే చెక్‌ పెట్టింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్లకు నగదు చెల్లించుకొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈవిషయాన్ని దక్షిణ మధ్య రైల్వే 'ఎక్స్‌' వేదికగా ప్రకటించింది. అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కౌంటర్ల వద్ద ఎదురయ్యే చిల్లర ఇబ్బందులు ఇకపై తప్పనున్నాయి. అన్‌రిజర్వుడ్‌, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలుకు రైల్వేస్టేషన్లలో ఉన్న ఆటోమేటిక్‌ టికెట్ వెండింగ్ మెషిన్‌ (ఏటీవీఎం)లో క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌తో డబ్బులు చెల్లించే సౌకర్యాన్ని రెండేళ్ల క్రితం ద.మ.రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌లోని యూపీఐ యాప్‌ల ద్వారా ఏటీవీఎంలోని క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి డబ్బు చెల్లిస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యూటీఎస్‌ (జనరల్ బుకింగ్) కౌంటర్లలోనూ క్యూఆర్ కోడ్ సౌకర్యం తీసుకురావడంతో అన్‌ రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు మరింత సులభతరం కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)