ప్రత్యేక ప్రతిభావంతుల కోసం దివ్యాంగజన్ రోజ్‌గార్ సేతు యాప్ !

Telugu Lo Computer
0

ప్రత్యేక ప్రతిభావంతుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి కేంద్రం ఒక వేదికను అభివృద్ధి చేసింది. వారి కోసం ఒక ప్రత్యేక పోర్టల్ PM-DAKSH-DEPWD (https://pmdaksh.depwd.gov.in/login) అందుబాటులో ఉంచింది. ఈ పోర్టల్‌లో ప్రత్యేక ప్రతిభావంతులు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. వివిధ కోర్సులు నేర్చుకోవచ్చు, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. అదే దివ్యాంగజన్ రోజ్‌గార్ సేతు యాప్. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో దివ్యాంగులు కృత్రిమ అవయవాలకు అలాగే సహాయక పరికరాల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు, ఇంటి నుంచే అప్లై చేసుకోవచ్చు. వివిధ ఆఫీస్‌లకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ ద్వారా దివ్యాంగులు ఏవైనా సమస్యలు లేదా పరిస్థితులను వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. దివ్యాంగులు అధికారులకు ఏదైనా కంప్లైంట్‌ చేసిన తర్వాత, దాని స్టేటస్‌ కూడా చెక్‌ చేయవచ్చు. దీంతో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)