కాషాయ కండువా కప్పుకున్నఆప్ ఎంపీ సుశీల్ రింకూ !

Telugu Lo Computer
0


ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరుపున లోక్‌సభలో ఉన్న ఏకైక ఎంపీ సుశీల్ రింకూ ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాయలంలో కాషాయ కండువా కప్పుకున్నారు. రింకూ 2023 జలంధర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. ప్రస్తుతం రాబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో జలంధర్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగుతారని తెలుస్తోంది. 543 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో రింకూ ఆప్ పార్టీ తరుపున ఉన్న ఒకే ఒక ఎంపీ. పంజాబ్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా జలంధర్‌ కోసం తాను బీజేపీలో చేరానని, అభివృద్ధి కార్యక్రమాలను ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. అంతముందు రోజు మంగళవారం లూథియానా ఎంపీ, కాంగ్రెస్ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా బీజేపీలో చేరారు. మిస్టర్ బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిలబడిని సిక్కు నేతల్లో బియాంత్ సింగ్ చాలా ప్రముఖుడు. పదవిలో ఉండగా ఉగ్రవాద దాడిలో ఆయన హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ మరియు చివరి దశ అయిన జూన్ 1న పోలింగ్ జరగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)