కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. సెన్సెక్స్-నిఫ్టీ దాదాపు 1.7 శాతం క్షీణతను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో తుడిచిపెట్టుకుపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్ల గరిష్ఠ నష్టాన్ని నమోదు చేయగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్ల క్లోజింగ్ దగ్గరపడుతున్న వేళ నష్టాలు తగ్గుతున్నాయి. సాయంత్రం 3 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 788 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ సూచీ 305 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 190 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1960 పాయింట్ల మేర భారీ క్షీణతను నమోదు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)