రాజకీయాల నుంచి వైదొలిగిన డాక్టర్ హర్షవర్థన్ !

Telugu Lo Computer
0


కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, భాజపా ఎంపీ డాక్టర్ హర్షవర్థన్  రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇకపై ఢిల్లీ కృష్ణానగర్‌లోని తన క్లినిక్‌లో వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని చాందినీ చౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. భాజపా నిన్న ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ''50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లోని జీఎస్‌వీఎమ్‌ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరినప్పుడు పేదలకు సాయం చేయాలనేది నా ఆశయం. ఆరెస్సెస్‌ సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా నా హృదయానికి దగ్గరగా ఉన్న పని చేశాను. పోలియో రహిత భారత్‌ కోసం, కరోనా రెండు విడతల్లో దేశ ప్రజలను కాపాడేందుకు నా వంతు కృషి చేశాను. ఇన్నేళ్ల నా రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు. ప్రధాని మోడీ  నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నా'' అని ట్వీట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)