మణిపూర్‌లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్‌ !

Telugu Lo Computer
0


తెగల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌ లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఆగంతకులు ఆయనను తన ఇంటి నుంచే అహపరించుకుని పోయారు. గత మే నెలలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి ఇది నాలుగో కిడ్నాప్ కావడం గమనార్హం. దౌబల్ జిల్లా నివాసి అయిన జూనియర్ కమిషన్డ్ అధికారి (JCO) కాన్సమ్ ఖేడ సింగ్‌ను శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అతని ఇంటి వద్ద నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. సమాచారం అందిన వెంటనే జేసీవోను కాపాడేందుకు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టామని, 102వ జాతీయ రహదారిపై అన్ని వాహనాలను తనిఖీ చేశామని భద్రతాధికారులు తెలిపారు. ఖేడ సింగ్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియలేదని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా గత ఏడాది మే నెల నుంచి ఇది 4వ ఘటన. కాగా 2023 మే నెల నుంచి భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా సెలవులకు వెళ్లినప్పుడు కిడ్నాప్ కావడం ఇది నాలుగోసారి. గత సెప్టెంబర్‌లో కూడా అసోం రెజిమెంట్ మాజీ సోల్జర్ సెర్టో తాంగ్‌తాంగ్ కోమ్‌ను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్ చేశారు. సింగ్‌ ఇంఫాల్ వెస్ట్‌లో సెలవుపై ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. దీనికి రెండు నెలల తర్వాత చురాచందర్‌పూర్ నుంచి లీమాక్హాంగ్‌కు ‘సువ్’లో వెళ్తున్న నలుగురు వ్యక్తులను గుర్తుతెలియని సాయుధ దుండగులు అహరించుకు వెళ్లి కాల్చిచంపారు. వీరంతా జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ తరఫున పనిచేసిన ఓ సైనికుడి కుటుంబ సభ్యులు కావడం విశేషం. ఈ ఘటనలోనే ఐదో ప్రయాణికుడైన సోల్జర్ తండ్రి గాయపడి ఎట్టకేలకు తప్పగించుకుని బయటపడ్డారు. అతన్ని చికిత్స కోసం హెలికాప్టర్‌లో ఆర్మీ అధికారులు దిమాపూర్ తరలించారు. అంతేగాక ఫిబ్రవరి 27న ఇంఫాల్ సిటీ నుంచి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒకరిని సాయుధులు కిడ్నాప్ చేశారు. దీనికి నిరసనగా మణిపూర్ పోలీస్ కమెండోలు ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లో ‘ఆర్మ్స్ డౌన్’ నిరసన సైతం తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)