ట్రాఫిక్ ఎస్ఐపై యువకుని వీరంగం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో ట్రాఫిక్ ఎస్ఐపై ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అతడిని ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు. దీంతో యువకుడు రెచ్చిపోయాడు. బండ బూతులు తిడుతూ తాను సైకోనని, తనకు చలానా రాస్తే నీ ఉద్యోగం ఊడగొడతానని బెదిరించాడు. తనతో పెట్టుకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. తన బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని అన్నాడు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో తన గురించి తెలుసుకో అని యువకుడు ఎస్ఐకి సూచించాడు. ఈ విషయంపై ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)