నాగ్‌పూర్‌ ఆర్టీసీ బస్సులో బాంబు !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్టీసీ బస్సులో లైవ్‌ బాంబ్‌ను గుర్తించారు. ఈ విషయం తెలిసిన బాంబ్‌ స్క్వాడ్‌ వెంటనే ఆ బస్సు వద్దకు చేరుకున్నది. అందులో ఉన్న బాంబును నిర్వీర్యం చేసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  గణేష్‌పేట బస్‌ టెర్మినల్‌ వద్ద రెండు రోజులుగా ఒక ఆర్టీసీ బస్సు నిలిచి ఉంది. గడ్చిరోలి నుంచి వచ్చిన ఆ బస్సులో బాంబు మాదిరి పేలుడు పదార్థాన్ని బుధవారం గుర్తించారు. దీంతో బాంబు స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. కాగా, బాంబ్‌ డిస్పోజబుల్‌ స్క్వాడ్‌ వెంటనే అక్కడకు చేరుకుంది. బస్సులో గుర్తించిన లైవ్ బాంబును సురక్షిత ప్రాంతంలో నిర్వీర్యం చేసింది. పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు. దీంతో పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు. మరోవైపు బస్సులో గుర్తించిన బాంబును స్క్వాడ్‌ నిర్వీర్యం చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)