దక్షిణాఫ్రికా కోచ్ మైక్ ప్రోక్టర్ కన్నుమూత

Telugu Lo Computer
0


క్షిణాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ మైక్ ప్రొక్టెర్ కన్నుమూశాడు. గుండె సర్జరీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న అతడు 77 ఏండ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. ప్రపంచంలోని గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడిగా తన ముద్ర వేసిన మైక్ మరణవార్తతో దక్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం నెలకొంది. దక్షిణాఫ్రికా గొప్ప క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన మైక్ కెరీర్ 1970- 1980 మధ్య కాలంలో ప్రశ్నార్థకంగా మారింది. దాంతో మీడియం పేసర్ అయిన మైక్ దేశం తరఫున 7 టెస్టులు మాత్రమే ఆడాడు. అది కూడా ఆస్ట్రేలియా మీదనే కావడం విశేషం. ఈ ఏడు మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)