క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య !

Telugu Lo Computer
0


హైద్రాబాద్ లోని లాలాపేటకు చెందిన సురేశ్ కుమార్ (48)కు మారేడ్ పల్లికి చెందిన భాగ్య(45)తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీళ్లు కీసరలోనే స్థిర పడ్డారు. సురేశ్ దంపతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. శనివారం ఉదయం వీళ్లు విగతజీవులుగా కనిపించారు. వారి వద్ద సూసైడ్ నోట్ ఒకటి లభించింది. ఆ నోట్ లో తమ చావుకు కారణం క్రెడిట్ కార్డు అధికారులు అంటూ రాసుకొచ్చారు. సురేశ్ కు క్రెడిట్ కార్డు బిల్లు పెండింగ్ ఉంది. అది ఎన్ని నెలలుగా ఉందో క్లారిటీ లేదు. క్రెడిట్ కార్డు అధికారులు ఇంటికి వచ్చి బిల్లు కట్టాలంటూ ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. వాళ్లు ఇంటికి వచ్చి అడగడంతో ఇరుగు పొరుగు ముందు పరువు పోయిందని మనస్థాపానికి గురైన సురేశ్- భాగ్య దంపతులు పిల్లలను బంధువుల ఇంటికి పంపి.. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సురేశ్, భాగ్య ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)