యువతి కాపాడిన కండక్టర్‌ !

Telugu Lo Computer
0


మిళనాడులోని ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న బస్సులో కొందరు ప్రయాణికులున్నారు. ఆ బస్సు చిత్తర్ సమీపిస్తుండగా దిగేందుకు ఒక యువతి డోర్‌ వద్దకు వచ్చింది. అయితే బస్సు ఒక్కసారిగా కుదుపు ఇవ్వగా డోర్‌ వద్ద ఉన్న ఆమె కదులుతున్న బస్సు నుంచి బయటకు పడబోయింది. కాగా, బస్సు డోర్‌ ఫుట్‌బోర్డ్‌ వద్ద ఉన్న కండక్టర్‌ వెంటనే స్పందించాడు. బస్సు నుంచి పడబోయిన మహిళ తల జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను బస్సులోకి లాగి కాపాడాడు. మరో ప్రయాణికురాలు కూడా సహకరించింది. అనంతరం స్టాప్‌ వద్ద బస్సు ఆగడంతో ఆ యువతి దిగింది. తనను కాపాడిన కండక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. మరోవైపు ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)