బిడ్డ కోసం విలపించిన ఏనుగు !

Telugu Lo Computer
0


ఏనుగు తన బిడ్డ కోసం బోరున విలపించింది. పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన సమాధి వద్ద కన్నీళ్లు కార్చుతూ అలానే  ఏనుగు ఉండిపోయింది. ఈ హృదయ విదారక ఘటనను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే ఓ ఏనుగు తన పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. కానీ కొన్ని గంటల్లోనే ఆ పిల్ల ఏనుగు చనిపోయింది. పోస్టుమార్టం అనంతరం దాన్ని పూడ్చిపెట్టారు. ఇక ఆ సమాధి వద్దకు చేరుకున్న తల్లి ఏనుగు బోరున విలపించింది. తన కళ్ల నుంచి కన్నీరు కారుతూనే ఉంది. ఏనుగు గుండెలవిసేలా రోదించడంతో అక్కడున్న అటవీశాఖ అధికారుల హృదయాలు బరువెక్కిపోయాయి. తల్లీపిల్లల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం వర్ణనాతీతం అని సుశాంత నంద పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)