తుర్కియేలో పర్యటించనున్న పుతిన్‌ ?

Telugu Lo Computer
0


రష్యా అధ్యక్షుడు పుతిన్‌ త్వరలో తుర్కియేలో పర్యటించనున్నట్లు తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు ఓ 'నాటో' సభ్యదేశానికి పుతిన్ వెళ్లడం తొలిసారి అవుతుంది. తమ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశమై నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాల ఎగుమతులకు కొత్త మార్గాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి ఫిదాన్‌ తెలిపారు. రష్యా అధినేత పర్యటన తేదీని పేర్కొనలేదు. అయితే.. ఫిబ్రవరి 12న వచ్చే అవకాశముందని స్థానిక మీడియా చెప్పింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి తన దేశానికి పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం గతేడాది అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అంటే.. ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో ఆయన కనిపిస్తే అరెస్టు చేయాల్సి ఉంటుంది. రష్యా మాదిరే తుర్కియే కూడా ఇందులో చేరలేదు. కీవ్‌పై మాస్కో సైనిక చర్య ప్రారంభమై రెండేళ్లు సమీపిస్తోంది. ఇరుపక్షాలతోనూ మంచి సంబంధాలు కొనసాగించేందుకు అంకారా ప్రయత్నిస్తోంది. సిరియాలో భద్రత పరిస్థితులు, ఇంధన సహకారంపై కూడా ఇరునేతలు చర్చిస్తారని ఫిదాన్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)