బండ్ల గణేశ్‌ రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్లాన్ !

Telugu Lo Computer
0


హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండి నౌహీరా షేక్‌ బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బండ్ల గణేశ్‌కు నా ఇంటిని అద్దెకు ఇచ్చాను. నా ఇంటిని చూసేందుకు వెళ్లగా ఆక్రమణ అంటూ కేసు పెట్టారు.  రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేశ్‌ స్కెచ్‌ వేసాడని ఆమె ఆరోపించారు. ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలియడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లామని, తాము అక్కడ ఉండగానే పోలీసులు వచ్చి కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తెలుసంటూ బండ్ల గణేశ్‌ తమ ముందే ఫోన్‌లు చేశాడన్నారు. ఇంటిపై పదకొండు నెలల రెంట్‌ అగ్రిమెంట్‌ను బండ్ల గణేశ్‌ ఫోర్జరీ చేశాడని, దీనిపై తమకు సుపీరంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఫిలింనగర్‌ పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)