రాహుల్‌ గాంధీ కారుపై దుండగుల దాడి

Telugu Lo Computer
0

శ్చిమ బెంగాల్‌ లో రాహుల్‌ గాంధీ కారుపై దుండగుల దాడికి పాల్పపడ్డారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పశ్చిమ బెంగాల్‌ లో కొనసాగుతోంది. మణిపూర్ లో ప్రారంభమైన ఈ యాత్ర.. బిహార్ మీదుగా ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి ప్రవేశించింది. బుధవారం బెంగాల్ లోని మాల్దాలో రాహుల్‌ గాంధీ యాత్ర జరుగుతుండగా కొందరు దుండగులు రాహుల్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వెనకభాగం అద్దాలు ధ్వంసమయ్యాయి. రాహుల్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుండగులను అదుపులోకి తీసుకున్నారు.కాగా, ధ్వంసమైన కారులోనే రాహుల్ తన యాత్రను కొసాగిస్తూ ముందుకు సాగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)