కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు జనవరి 18న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీస్‌లను కేజ్రీవాల్ తిరస్కరించారు. ఆ నోటీస్‌లు అక్రమంగా ఉన్నాయని, కేవలం తనను అరెస్టు చేసేందుకు నోటీసులు ఇచ్చినట్టు కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న హాజరు కావాలని ఆదేశించారు. కానీ మూడు సార్లూ ఆయన ఈడీ నోటీసుల్సి పట్టించుకోలేదు. మద్యం విధానం కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను గత ఏడాది ఏప్రిల్‌లో విచారించింది. కానీ సీబీఐ మాత్రం ఆప్‌నేతను నిందితుడిగా పేర్కొనలేదు. అయితే తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చిన తరువాత … కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు ఊహాగానాలు వినిపించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)