కూతురు చావుకు అల్లుడే కారణమని కొట్టి చంపారు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వివాహిత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అందుకు ఆమె భర్తే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భర్తను కొట్టి చంపారు. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సింధు, నాగార్జునలు అచ్చంపేటలో జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తలు మధ్య తరచూ గొడవపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గత రాత్రి సింధు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ముందుగా నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో మార్గమధ్యలోని సింధు మృతి చెందింది. సింధు మరణించిన విషయం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలవడంతో ఆగ్రహంతో సింధు భర్త నాగార్జునను అదుపులోకి తీసుకొన్నారు. కొంత దూరం వెళ్ళాక నాగార్జునపై తీవ్రంగా దాడి చేశారు. నీ వల్లే సింధు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అర్ధరాత్రి ఇనుపరాడ్లు, కర్రలతో ఆమనగల్ వద్ద నాగార్జున ను కొట్టిచంపారు. కల్వకుర్తి ఆసుపత్రిలో నాగార్జున మృతదేహం లభ్యమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)