పానీ పూరీ అమ్మడానికి థార్ కారుని ఉపయోగించిన యువతి !

Telugu Lo Computer
0


సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరిని ఆకర్షించే థార్ కారుని ఒక యువతి పానీ పూరీ అమ్మడానికి ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఒక పానీపూరీ విక్రయించే యువతి తన పానీపూరీ బండిని లాగడానికి మహీంద్రా థార్ ఉపయోగిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోను  చూసి  ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ ప్రజలు ఎదగటానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నట్లు, ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆ యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పానీపూరి బండిని గతంలో స్కూటర్‌తో, తర్వాత బుల్లెట్ బైక్‌తో, ఇప్పుడు మహీంద్రా థార్‌తో లాగుతుంది. ఈమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్. పానీపూరి బండిని లక్షల ఖరీదైన కారుతో లాగడం చూసి చాలామంది అవాక్కవుతున్నారు, మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఈ మహీంద్రా థార్ కారుని పానీపూరీ అమ్మి కొనుగోలు చేసినట్లు ఆ యువతి తెలియజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)