డీకే శివకుమార్ కేసు సీబీఐ నుంచి లోకాయుక్తకు బదిలీ !

Telugu Lo Computer
0


'జైహింద్ టీవీ ఛానల్'లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణ కు రావాలని పేర్కొంది. 'జైహింద్ టీవీ'లో పెట్టుబడులు, వాటాల వివరాలు తెలపాలని కోరింది. ఈ కేసులో శివకుమార్‌, ఆయన భార్య ఉషతో పాటు మరో 30 మందికి కూడా సీబీఐ నోటీసులు పంపించింది. కాగా ఈ కేసును కర్ణాటక లోకాయుక్తకు బదిలీ చేయాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. సీబీఐ నుంచి లోకాయుక్తకు కేసు బదిలీ చేయడం వెనుక మర్మం ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వ ఉత్తర్వులను కర్ణాటక కేబినెట్ రద్దు చేసిన తర్వాత కేసును లోకాయుక్తకు బదిలీ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సౌత్ ఫస్ట్‌కు ధృవీకరించింది. ఈ కేసును లోకాయుక్తకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)