తెలంగాణలో 15 జిల్లాలు రద్దు ?

Telugu Lo Computer
0


పది జిల్లాతో ఏర్పడిన తెలంగాణను గత సీఎం కేసీఆర్‌ తన లక్కీనంబర్‌ కలిసేలా జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. అశాస్త్రీయంగా, అసంబంద్ధంగా పాత జిల్లాలను  విభజన చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలో ఒకటిన్నర నియోజకవర్గమే ఉండడం ఇందుకు నిదర్శనం. ఇక కొన్ని జిల్లాల్లో ఒక నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉంది. దీంతో ఒక ఎమ్మెల్యే మూడు జిల్లా పరిషత్‌లలో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో ములుగు, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి. ఈ జిల్లాల్లో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయి. ఇలాంటి జిల్లాలను ఎత్తివేస్తారని తెలుస్తోంది. మొత్తంగా 33 జిల్లాలను 18 జిల్లాలకు పరిమితం చేస్తారని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే జిల్లాల కుదింపు అంత ఈజీ కాదన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు నిర్మించారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. జోనల్‌ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించారు. లోకల్, నాన్‌లోకల్‌ కేడర్‌పై స్పష్ట ఇచ్చారు. మరోవైపు జిల్లాల విభజనతో జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలను కుదిస్తే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో జిల్లాల అంశాన్ని కదిలిస్తే తేనెతుట్టెను కదిలించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)