ఇండియా కూటమి కన్వీనర్‌గా నీతీశ్ కుమార్‌ ?

Telugu Lo Computer
0


'ఇండియా' కూటమికి బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ కన్వీనర్‌గా నియమితులు కానున్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లో విపక్ష పార్టీలన్నీ వర్చువల్‌గా సమావేశమై ఈ నిర్ణయాన్ని ఆమోదించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకంపై కాంగ్రెస్‌ పార్టీ, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో చర్చించిందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత నియామకంపై కూటమిలో మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిగాయి. కీలక పార్టీ అయిన ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ కూడా తన మద్దతు ప్రకటించారని ఆ వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)