పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌ సస్పెండ్‌

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా కె.సతీశ్‌ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్‌ అయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన సతీశ్‌ 2023 జూన్‌ 14న పహాడీషరీఫ్‌ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)