కేరళ గవర్నర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ

Telugu Lo Computer
0

కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ దిష్టిబొమ్మను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) దగ్ధం చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా కన్నూరు జిల్లాలోని పయ్యంబలం బీచ్‌లో 30 అడుగుల ఎత్తులో గవర్నర్ దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ అనుశ్రీ ఆధ్వర్యంలో జరిగింది. కన్నూరు జిల్లాలోని పయ్యంబలం బీచ్‌కు ఎంతో ప్రత్యేకత ఉన్నది. డిసెంబర్ 31న భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. అదే సమయంలో గవర్నర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయన తీరును ఎండగట్టారు. సంఘ్ పరివార్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను యూనివర్సిటీలలో నామినేట్ మెంబర్లుగా నియమిస్తూ, అన్ని వర్సిటీలను కాషాయికరణం చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)