ఇండిగో పైలట్‌పై ప్రయాణికుడి దాడి !

Telugu Lo Computer
0


ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా ఆలస్యం అయింది. ఇదే విషయాన్ని పైలట్ ప్రకటించాడు. ఇది విన్న ఓ ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. పైలట్‌ వద్దకు దూసుకువచ్చి దాడి చేశాడు. ఇండిగో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని విమానం నుంచి దించేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ విమానం 13 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. దాంతో భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం కూడా వందకు పైగా విమానాలు ఆలస్యంకాగా.. 79 రద్దయ్యాయి. ఈ పరిస్థితులతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)