ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఎలుక, బొద్దింక ?

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన రాజీవ్ శుక్లా అనే లాయర్‌ ముంబైకి వెళ్లి జనవరి 8న వర్లీలోని బార్బెక్యూ నేషన్‌లో క్లాసిక్ వెజ్ మీల్ బాక్స్ కోసం ఆన్‌లైన్ ఆర్డర్ చేశాడు. ఆహారం రాగానే శుక్లా తినడం ప్రారంభించాడు. అతను దాల్ మఖాని రుచి చూడగానే అందులో చనిపోయిన ఎలుక, బొద్దింకలను గమనించాడు. ఇది జరిగిన కాసేపటి తర్వాత, అతను గ్యాస్ట్రిక్ ట్రబుల్‌తో ఇబ్బంది పడ్డాడు. అనంతరం అతను సివిక్రన్ బీవైఎల్ నాయర్ హాస్పిటల్‌కి వెళ్లవలసి వచ్చింది. తాను ముంబైని చూద్దామని ప్రయాగ్‌రాజ్ నుండి వచ్చానని, కానీ బహుశా ఇదే తన చివరి ప్రయాణం కావచ్చనిపిస్తుందని శుక్లా తెలిపాడు. తాను స్వచ్ఛమైన శాఖాహారినని, కానీ బార్బెక్యూ నేషన్ ఆర్డర్ తనకు షాక్ ఇచ్చిందన్నాడు. ఆహారంలో చనిపోయిన ఎలుక, బొద్దింకలు ఉన్నాయని, ఆ తర్వాత తాను ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడుతూ, నాయర్ ఆసుపత్రిలో చేరారనన్నాడు. బార్బెక్యూ నేషన్ వారి కల్తీ ఆహారం గురించి ఫిర్యాదు చేస్తూ వెంటనే ఇమెయిల్ పంపినట్లు శుక్లా తెలిపారు. తన తలలో ఇంకా వికారంగా ఉందని, ఫుడ్ బిజినెస్ కోసం వారు ఈ పని చేస్తున్నారన్నాడు. వారికి మనల్ని బ్రతికించడమే తప్ప మనల్ని చంపడం ఉద్దేశంగా ఉండకూడదని పప్పులో తేలియాడుతున్న ఎలుక చిత్రాన్ని పంచుకుంటూ శుక్లా రాశారు. ఆ తర్వాత బార్బెక్యూ నేషన్ మేనేజర్ నుండి రిప్లైను అందుకున్నా.. తనకు ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించాడు. ఇది జరిగిన ఆరు రోజుల తర్వాత, బార్బెక్యూ నేషన్ యజమాని, మేనేజర్, చెఫ్‌పై శుక్లా నాగ్‌పడా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)