హర్యానా అసెంబ్లీ స్థానాలన్నిటికీ ఆప్ పోటీ

Telugu Lo Computer
0


ర్యానా అసెంబ్లీ లోని మొత్తం 90 స్థానాలకు తమ పార్టీ స్వయంగా పోటీ చేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరగనుండగా, ఈ ఏడాది తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. " ఈరోజు ప్రజలకు ఒకే ఒక పార్టీపై విశ్వాసం ఉంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకపక్క తాము వారు పంజాబ్‌ను, మరోవంక ఢిల్లీ లోని తమ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం హర్యానా పెద్ద మార్పును ఆకాంక్షిస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌ల్లో ప్రజలు వేగంగానే పెద్ద మార్పు తెచ్చారు. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు " అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. జింద్‌లో ఆప్ పార్టీ బద్లావ్, జనసభ లో కేజ్రీవాల్ మాట్లాడారు. హర్యానా అసెంబ్లీ అన్నిస్థానాలకు ఆప్ పోటీ చేయనుండగా, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా బ్లాక్‌లో భాగంగా పోరాటం సాగిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సిఎం భగవంత్‌మాన్ కూడా పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)