అమెరికా, బ్రిటన్‌ లకు హౌతీల హెచ్చరిక !

Telugu Lo Computer
0


మపై దాడులు చేసిన అమెరికా, బ్రిటన్‌లకు యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దాడులకు పాల్పడ్డ అమెరికా, యూరప్‌లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హౌతీల డిప్యూటీ ఫారెన్‌ మినిస్టర్‌ అల్‌ ఎజ్జీ మాట్లాడుతూ 'యెమెన్‌పై హౌతీలు లక్ష్యంగా అమెరికా,బ్రిటన్‌లు భారీ దాడులు చేశాయి. ఇందుకు వారు తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని అన్నారు. హౌతీ గ్రూపు మరో సీనియర్‌ మెంబర్‌ మాట్లాడుతూ ఎర్ర సముద్రంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లకు చెందిన వార్‌ షిప్పులపై ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు తెలిపాడు. మరోవైపు హౌతీ గ్రూపు లక్ష్యంగా అమెరికా, బ్రిటన్‌లు జరిపిన దాడులు క్రూరమైనవని ఇరాన్‌ అభివర్ణించింది. ఈ దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)