విద్య, వైద్యం తప్ప ఏదీ ఫ్రీగా ఇవ్వద్దు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ, తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి, ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. ప్రతి వ్యక్తికి మొదట కన్న తల్లిదండ్రులే దైవం అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకోని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదు. ప్రజలకు  విద్య, వైద్యం తప్పా, ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి అని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలన్నారు. శారీరకంగా దృఢంగా  ఉంటేనే, మానసికంగా ధృఢంగా ఉంటారు. ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవు అన్నారు.. ఇంట్లో వంట రూమ్‌, పూజా రూమ్‌ తప్పకుండా ఉండాలన్నారు. ఇటీవల ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు.. అది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)