తెలంగాణలో రిటైర్డ్ అధికారులు 1,049 మంది !

Telugu Lo Computer
0


తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలింది. అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1049 మంది ఉన్నట్లు జీఏడీ లిస్ట్ ను సీఎస్ కు పంపింది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనకు అందజేయనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. త్వరలో వీరి తొలగింపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కాగా అత్యధికంగా మున్సిపల్ డిపార్ట్​మెంట్​లో179 మంది, ఎడ్యుకేషన్ లో 88 మంది, సివిల్ సప్లై స్​లో 75 మంది, ఆర్​అండ్​బీలో 70 మంది, పంచాయతీరాజ్​లో 48 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా రిటైర్ అయినప్పటికీ బీఆర్ఎస్ రెండు టర్మ్​లలో కన్సలెంట్లుగా, సలహాదారులుగా, ఈఎన్సీలుగా కొనసాగారు. గత ప్రభుత్వంలో పెద్దల కులానికి చెందిన, అనుకూలంగా ఉన్న ఆఫీసర్లు చాలా ఏండ్ల కిందనే రిటైర్ అయినప్పటికీ వారిని తీసుకొచ్చి ఉన్నత పోస్టుల్లో కూర్చోబెట్టింది. వీరిలో చాలా మంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండా అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉత్తర్వులు ఇచ్చారు. లక్షల్లో జీతాలు చెల్లించడంతో పాటు వెహికల్, ఆఫీసు, అదనపు సిబ్బంది ఇలా అన్ని సౌలత్​లు కేటాయించడంతో సర్కారుపై కోట్ల రూపాలయ భారం పడింది. అధికారుల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లు ఉండటం గమనార్హం. సెక్రటేరియెట్ లో ప్రోటోకాల్ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వర్తిస్తున్న అర్విందర్ సింగ్, ఎండో మెంట్ కమీషనర్ అనీల్ కుమార్, పశుసంవర్ధక శాఖలో స్పెషల్ సీఎస్ గా అధర్ సిన్హా, లేబర్ డిపార్ట్ మెంట్ లో స్పెషల్ సీఎస్ గా రాణికుముదిని, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉమర్ జలీల్ ఉన్నారు. వీరిని కూడా ప్రభుత్వం రిలీవ్ చేయనుందని సమాచారం. ఆర్టీసీలో ఓ మహిళ కన్సల్టెంట్ కు రూ.7 లక్షల జీతం చెల్లిస్తున్నారు. కార్పొరేషన్ కు ఓ సాఫ్ట్ వేర్ డెవలపింగ్ కంపెనీకి మధ్య ఆమె కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆ సాఫ్ట్​వేర్​ కంపెనీ ఆర్టీసీలో ఓ ఉన్నతాధికారి ఫ్రెండ్ కు సంబంధించిందన, సంస్థకు ఐటీ సేవలు అందిస్తున్నందుకు దానికి ఏడాదికి రూ.8 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. మరో రిటైర్ట్ ఐపీఎస్ ను సీవోవోగా నియమించి నెలకు రూ.1.5 లక్షల జీతం చెల్లిస్తున్నారు. లీగల్ సెక్షన్ లో పనిచేస్తున్న మరో కన్సల్టెంట్ కు రూ.70 వేల జీతం చెల్లింస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చాలా మందిని రూ.లక్షకు పైగా జీతంతో బస్ భవన్ లో ఓ ఉన్నతాధికారి నియమించినట్లు వెల్లడించాయి. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్, రిటైర్డ్ అధికారులకు ప్రతి నెల రూ. 65 లక్షలు జీతాల రూపంలో చెల్లిస్తున్నట్లు తెలిపాయి. ఈ నియామకాలపై ఎంక్వైరీ జరిపిస్తే చాలా అక్రమాలు బయటకు వస్తాయని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)